'BRS అభ్యర్థులు గెలిస్తేనే కాంగ్రెస్‌కు గుణపాఠం'
PDPL: స్థానిక ఎన్నికల్లో BRS అభ్యర్థులను గెలిపిస్తేనే కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పవచ్చని, ప్రభుత్వం మెడలు వంచవచ్చని మాజీ MLA దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో ఓదెల మండల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. KCR పాలనలో సజావుగా నడిచిన సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదన్నారు.