విద్యుత్ షాక్‌తో వ్యక్తికి తీవ్ర గాయాలు

విద్యుత్ షాక్‌తో వ్యక్తికి తీవ్ర గాయాలు

PLD: నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్ తగిలి ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. గ్రామంలో కొత్త కరెంటు లైన్స్ లాగుతూ 11 కేవి వైరు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడని గ్రామస్థులు తెలిపారు. వెంటనే విద్యుత్ నిలిపి అతడిని స్తంభంపై నుంచి కిందకు దించి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.