చెరువులో మొసలి కలకలం.. గ్రామస్తుల ఆందోళన
WNP: వీపనగండ్ల(M) పరిధిలోని కల్వరాల గ్రామంలో మొసలి కలకలం రేపింది. గ్రామానికి సమీపంలో ఉన్న అమ్మ చెరువులో మొసలి ప్రత్యక్షమైందని స్థానికులు తెలిపారు. చెరువు వద్దకు వెళ్లిన కొందరు యువకులు నీటిలో కదులుతున్న మొసలిని గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో మొసలిని సురక్షితంగా పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.