AI సమ్మిట్ కేసులో పోలీసుల సంచలన వాదనలు
ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతల నిరసన కేసులో నిందితులు మనీష్ శర్మ, రాజీవ్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై పటియాలా హౌస్ కోర్టు విచారణ చేపట్టింది. 100కు పైగా దేశాలు పాల్గొన్న సదస్సులో జరిగిన నిరసన అసలు 'AI'కి వ్యతిరేకం కాదని ఢిల్లీ పోలీసులు కోర్టులో వాదించారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ నిరసనలు జరిగాయని ASG DP సింగ్ తన వాదనలను వినిపించారు.