VIRAL: రక్త సంబంధం కాదు.. సైనిక బంధం
తండ్రిని కోల్పోయిన యువతి పెళ్లిలో జవాన్లు పెళ్లి పెద్దలుగా మారి మానవత్వాన్ని చాటారు. ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది. యూపీ బాగ్పత్‌కు చెందిన సైనికుడు హరేంద్ర సింగ్ ప్రమాదంలో మృతిచెందగా ఆయన కుమార్తె వివాహానికి తోటి జవాన్లు హాజరయ్యారు. స్వయంగా కన్యాదానం చేసి రూ.6.10 లక్షలు కానుకగా ఇచ్చి చివరి వరకు అండగా నిలిచారు. జై జవాన్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.