పెదవీడు గొర్రెల మందలో జింక పిల్ల జననం

పెదవీడు గొర్రెల మందలో జింక పిల్ల జననం

SRPT: మఠంపల్లి మండలం పెదవీడులో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. కోదాడకు చెందిన గొర్రెల కాపరి చింత భాస్కర్ తన గొర్రెల మందను మేపుతుండగా, అడవి నుంచి వచ్చిన ఓ జింక మందలో చేరింది. అచ్చునే అక్కడే అది పిల్లకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి జింక అక్కడి నుంచి వెళిపోయింది. జింక పిల్లను గమనించిన భాస్కర్, దాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు. ప్రస్తుతం జింక పిల్లను అధికారులు సంరక్షిస్తున్నారు.