మొగిలి పెంట అడవుల్లో ఇద్దరు అరెస్టు
TPT: కోడూరు (M) మొగిలి పెంట అడవుల్లోకి ప్రవేశించిన తమిళనాడు జమునామత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు.అక్కడి నుంచి వారు పారిపోయే ప్రయత్నం చేయగా, పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్ల నుంచి గొడ్డళ్లు, రంపాలను స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.