ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ

SKLM: రణస్థలం మండలం సంచాం గ్రామంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై వినతులు సమర్పించారు. వచ్చిన వారితో స్వయంగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. అర్జీలు స్వీకరించిన అనంతరం సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు.