ఉచిత కూరగాయల విత్తనాలు పంపిణీ
NRPT: నారాయణపేట ఉద్యానవన శాఖ కార్యాలయంలో దామరగిద్ద మండలం సజనాపూర్ గ్రామానికి చెందిన మహిళలకు ఉచితంగా కూరగాయల విత్తనాలు పంపిణీ చేసినట్లు జిల్లా అధికారి సాయిబాబా తెలిపారు. జిల్లాలో రెండు వేల మందికి వివిధ రకాల కూరగాయల నాణ్యమైన విత్తనాలను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. కూరగాయలు పండించే రైతులకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.