డోర్నకల్ లో మట్టి విగ్రహాల పంపిణీ

డోర్నకల్ లో మట్టి విగ్రహాల పంపిణీ

MHBD: డోర్నకల్ పట్టణంలోని గాంధీ సెంటర్‌లో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు. స్థానిక MLA డా. జాటోత్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు వీటిని పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలని పూజించాలని వారు కోరారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, ఆర్పిలు తదితరులున్నారు.