దంపతుల మధ్య వివాదం.. భార్య ఆత్యహత్య
కృష్ణా: దంపతుల మధ్య గొడవ అవ్వడంతో రైలు కింద పడి భార్య మరణించిన ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. గుడ్‌మెన్ పేటకు చెందిన వేమరపు విజయ్, అనిత దంపతుల మధ్య గురువారం రాత్రి వివాదం జరిగింది. తెల్లవారగానే భీమవరం రైల్వే లైనుపై అనిత మృతి చెందింది. దీంతో భార్య లేని బతుకు వ్యర్థమంటూ భర్త ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు కాపాడారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమేదు చేశారు.