VIDEO: ఆలయంలో వేలంపాట వాయిదా

MLG: మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన లడ్డూ ప్రసాదం, తలనీలాల వేలం పాట వాయిదా పడినట్లు శనివారం ఈవో సత్యనారాయణ తెలిపారు. వేలం పాటలో 8 మంది ఆదివాసీ గిరిజనులు టెండర్లు వేశారు. అందులో వేదశ్రీ అనే మహిళ పెసా చట్టం నిబంధన మేరకు అర్హురాలు కాదని అభ్యంతరం తెలపడంతో ఈనేల 5వ తేదీకి వాయిదా వేశారు.