మండలంలో యూరియా కొరత.. రైతుల్లో ఆందోళన

మండలంలో యూరియా కొరత.. రైతుల్లో ఆందోళన

కృష్ణా: కంకిపాడు(M)లో గత 30 ఏళ్లలో కనీవినీ ఎరుగని యూరియా కొరతను ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. మండలంలో సుమారు 16 వేల ఎకరాల వ్యవసాయ భూమికి 700 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైనప్పటికీ, కేవలం 70మెట్రిక్ టన్నులే సోసైటీల ద్వారా రైతులకు అందుబాటులోకి వచ్చింది. పునాదిపాడు, కంకిపాడు లాంటి సోసైటీల పాలకులు చేతులెత్తేస్తూ, తమ వద్ద సరిపడా నిల్వలు లేవని అంటున్నారు.