8025 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి

E.G: నిడదవోలు నియోజకవర్గంలో మరో 8025 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిడదవోలు మండలంలో 1000 మెట్రిక్ టన్నులు,పెరవలి మండలంలో 1000 మెట్రిక్ టన్నులు, ఉండ్రాజవరం మండలంలో 6025 మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలుకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. అన్నదాతకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.