మత్స్యకారుడు మృతిపై మంత్రి దిగ్భ్రాంతి
SKLM: పోలాకి మండలం గుప్పిడిపేట గ్రామంలో ఇవాళ సముద్రంలో వేటకు వెళ్లి చెందిన చెక్క రాజారావు మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు కోటబొమ్మాళి మండలం నిమ్మడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఒకప్రకటన విడుదల చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.