ఘనంగా ఆత్రం భగవంత్ రావు వర్ధంతి

ADB: ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు కోసం ఆదివాసి ఉద్యమ నేత ఆత్రం భగవంత్ రావు చేసిన కృషి మరువలేనిదని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. ఆదివారం ఆత్రం భగవంత్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సంఘం సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.