వివాహిత అనుమానాస్పద మృతి
GNTR: పొన్నూరు పట్టణంలోని 26వ వార్డుకు చెందిన షేక్ జీనత్ పర్వేజ్(26) అనే వివాహిత గురువారం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త, అత్తమామలే హత్య చేశారని మృతురాలి బంధువుల ఆరోపించారు. బంధువులు జీనత్ పర్వీన్ మృతిపై పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.