ఉండవెల్లిలో పంచాయతీ కార్యదర్శి బైక్ చోరీ

GDWL: ఉండవెల్లి మండలంలోని జోగుళాంబ రైల్వే హాల్ట్ పార్కింగ్ ప్రాంతంలో బైక్ చోరీ జరిగింది. పంచాయతీ కార్యదర్శి రవితేజ ఈ నెల 15న తన బైక్‌ను అక్కడ పార్క్ చేశారు. శనివారం తిరిగి వచ్చేసరికి అది కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఉండవెల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.