కురవి వీరభద్రుడి ఆదాయం రూ.63, 77, 836

కురవి వీరభద్రుడి ఆదాయం రూ.63, 77, 836

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని కురవి వీరభద్ర స్వామి దేవాలయం ఆవరణలో మంగళవారం సాయంత్రం హుండీ లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. గడిచిన ఈ ఐదు నెలల కాలంలో రూ.63, 77, 836లు ఆదాయం సమకూరింది. ఈ లెక్కింపు ప్రక్రియను ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ పర్యవేక్షించారు.