శ్రీనివాసులు సేవలు అభినందనీయం: మున్సిపల్ ఛైర్మన్
సత్యసాయి: హిందూపురం విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా 33ఏళ్లు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న శ్రీనివాసులు సేవలు అభినందనీయమని మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. శ్రీనివాసులు వృత్తిని దైవంగా భావించి నీతి, నిజాయితీగా పని చేశారని కొనియాడారు. అనంతరం ఆయనను సన్మానించారు.