29న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మహాసభలు
MNCL: ఈ నెల 29న మంచిర్యాలలోని మార్క్స్ భవన్‌లో జరగనున్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా 7వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు మంతెన మల్లన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ముష్క జ్యోతి తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభల కరపత్రం విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ... జిల్లాలోని కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.