నా పిల్లల ఫొటోలు వాడొద్దు: నటి

నా పిల్లల ఫొటోలు వాడొద్దు:  నటి

తన భర్త పీటర్ హాగ్‌పై నటి సెలీనా జైట్లీ గృహహింస కేసు పెట్టిన విషయం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సెలీనా.. తన పిల్లలను ఈ వివాదంలోకి తీసుకురావొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. 'నా గురించి రాసే వార్తల్లో నా పిల్లల ఫొటోలు వాడొద్దు. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నా. ఇప్పటికే ఈ విషయంలో నేను తల్లిగా ఎంతో బాధపడుతున్నా' అంటూ పోస్ట్ పెట్టింది.