రైతు సమస్యల కోసం ఐక్యత కావాలి: రైతు సంఘం
NDL: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యం కావాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఏ. రాజశేఖర్ పిలుపునిచ్చారు. నందికోట్కూరు మండలం కొణిదేలలో ఏపీ రైతు సంఘం సమావేశం జరిగింది. రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం పాలకులు పని చేస్తున్నారని, అన్ని రకాల పంటలకు చట్ట బద్దత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.