లేపాక్షిలో వైసీపీ ఐడీ కార్డుల వెరిఫికేషన్
సత్యసాయి: లేపాక్షిలో వైసీపీ ఐడీ కార్డుల వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ టి.ఎన్. దీపిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మండలంలోని పంచాయతీ కన్వీనర్లు, ఐటీ విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీ కేడర్ గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, వెరిఫికేషన్ పూర్తయిన కార్డుల క్యూఆర్ కోడ్లను ఆమె ప్రదర్శించారు.