కాళేశ్వరం నివేదికపై మంత్రి ఉత్తమ్ స్పందన

SRPT: కాళేశ్వరం నివేదికను స్పీకర్ టేబుల్ చేశారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు కూడా కాపీలు పంపించామని చెప్పారు. కోర్టు విషయాలపై వ్యాఖ్యానించబోనని స్పష్టం చేశారు. "అన్ని విషయాలు సభలోనే మాట్లాడుతామన్నారు. కాళేశ్వరం అంశంపై సాయంత్రం 4 గంటలకు చర్చ జరుగుతుంది” అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.