నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
W.G: పెనుమంట్ర మండలం మార్టేరు సబ్ స్టేషన్ పరిధిలో 33 కేవీ కొత్త లైన్ల నిర్మాణం కారణంగా సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ కె. మధుకుమార్ తెలిపారు. మార్టేరు, నెగ్గిపూడి, వెలగలేరు, సత్యవరం, కొయ్యేటిపాడు, వనంపల్లి తదితర గ్రామాలలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.