ఇదేందయ్యా ఇదీ - ఒక్క నెలకే రూ. లక్ష కరెంట్ బిల్లా..!
WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన దేవేందర్ రావు విద్యుత్ బిల్లు జీరో రావాల్సి ఉంది. అయితే, బిల్లు రూ. 1,34,517.5 రావడంతో అతడు షాక్ కు గురయ్యాడు. గత మే నెలలో రూ. 91,619 బిల్లు రాగా.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కొత్త మీటర్‌ను మార్చిన కూడా మళ్లీ లక్షకు పైగా రావడంతో బిల్లు రద్దు చేయాలని కోరుతున్నాడు.