వాడపల్లి వెంకన్న అన్నదాన భవనానికి విరాళం

వాడపల్లి వెంకన్న అన్నదాన భవనానికి విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సికింద్రాబాద్‌కి చెందిన పెన్మెత్స రాఘవేంద్ర పవన్ వర్మ, హిమాని దంపతులు స్వామి వారి అన్నదాన భవన నిర్మాణానికి రూ.50 వేలు ఆలయ ఉప కమిషనర్ చక్రధర్రావుకి అందజేశారు. వారిని ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.