సోమందేపల్లిలో 'కాఫీ విత్ క్యాడర్' కార్యక్రమం

సోమందేపల్లిలో 'కాఫీ విత్ క్యాడర్' కార్యక్రమం

SS: సోమందేపల్లి మేజర్ పంచాయతీలోని బాలాజీ నగర్‌లో సోమవారం 'కాఫీ విత్ క్యాడర్' కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ప్రతి గడపకు వెళ్లి ప్రజలను పలకరించారు. గత జగన్ ప్రభుత్వంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయని వివరించారు. ముఖ్యంగా నేతన్న నేస్తం, చేనేత పెన్షన్ల ద్వారా లబ్ధి చేకూర్చామని గుర్తు చేశారు.