VIDEO: 'ప్రజా సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత అధికారులదే'
WNP: ప్రజా సమస్యలను పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్‌తో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.