రేపు బోగోలు మండల సాధారణ సమావేశం
NLR: బోగోలు మండల ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశ కార్యక్రమాన్ని ఈనెల 8వ తేదీన నిర్వహిస్తున్నట్లు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి సుబ్రమణ్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. మండల ప్రజాప్రతినిధులు అధికారులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలన్నారు.