కొడుకుకి సుపారీ ఇచ్చి హత్య చేయించిన తల్లి

కొడుకుకి సుపారీ ఇచ్చి హత్య చేయించిన తల్లి

అన్నమయ్య: తల్లి సుపారీ ఇచ్చి మరీ కొడుకుని హత్య చేయించిన దారుణ ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. బి. కొత్తకోటకు చెందిన శ్యామలమ్మ తన పెద్ద కొడుకు జయప్రకాశ్ రెడ్డిని హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్‌తో రూ. 6 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి పంచాలని, మద్యానికి డబ్బులివ్వాలని వేధిస్తుండడంతో ఈ హత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు.