'అమరావతి కాలనీలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు'

CTR: కుప్పం మున్సిపాలిటీ అమరావతి కాలనీలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమరావతి కాలనీలో సోమవారం ప్రజల నుంచి మున్సిపల్ అధికారులు వినతులు స్వీకరించారు. కాలనీలో నెలకొన్న అనేక సమస్యలను ప్రజలు అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.