VIDEO:టెండర్ ప్రక్రియలో గందరగోళం

WGL : పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గా టెండర్ ప్రక్రియ గందరగోళానికి దారితీసింది. గురువారం టెండర్‌ను వ్యతిరేకిస్తూ అన్నారంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన పలువురు టెండర్‌ను అడ్డుకున్నారు. గతంలో ఇదే టెండరు 2కోట్ల 11లక్షలకు పాడడంతో దర్గాకు వచ్చేభక్తులపై తీవ్ర ఆర్థికభారం మోపారని వారు పేర్కొన్నారు. రుసుము తగ్గించి టెండర్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.