నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి
KMM: ఇవాళ ఖమ్మం రూరల్, అర్బన్‌లలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటిస్తారని మంత్రి క్యాంపు కార్యాలయం ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ఆర్ & బీజీఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్‌లో ఈటీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవంలోను, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.