పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

KKD: కరప మండలం గొర్రిపూడి శివారులో పేకాట స్థావరంపై గురువారం సాయంత్రం ఎస్ఐ తోట సునీత ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.