VIDEO: ఆరోగ్య అవగాహన కార్యక్రమం
VSP: బాలయ్య శాస్త్రి లేఔట్ హిల్ వ్యూ పార్కులో ఆదివారం నిర్వహించిన ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో రిటైర్డ్ నర్సింగ్ సూపరిండెంట్ బి. సావిత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యవసర సమయంలో CPR చేయడం, స్ట్రోక్, హార్ట్ ఎటాక్ సందర్భాల్లో తీసుకోవాల్సిన చర్యలను ప్రాక్టికల్‌గా వివరించారు. అలాగే గుండె, షుగర్ వ్యాధుల నియంత్రణకు వ్యాయామాలు, ప్రాణాయామాలు, ముద్రలను చూపించి జాగ్రత్తలు సూచించారు.