స్వర్ణాంధ్రా - స్వచ్చాంధ్రా ర్యాలీలో పాల్గోన్న చైర్‌పర్సన్

VZM: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్‌పర్సన్ బంగారు సరోజిని సూచించారు. శనివారం స్వర్ణాంధ్ర - స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి రామతీర్థం జంక్షన్ వరకు చేపట్టన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలువల్లో చెత్త వేయొద్దని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.