ప్రియుడు చనిపోయాడని యువతి బలవన్మరణం
SDPT: కుకునూరుపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడని మనస్తాపంతో 18 ఏళ్ల శ్రావణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసి కూలీ పనులకు వెళ్తున్న శ్రావణికి దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేష్ అలియాస్ రసీం బాబాతో పరిచయం ఏర్పడింది. ఇటీవల మహేష్ మృతి చెందడంతో మనస్తాపంతో శ్రావణి ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.