'పొరపాట్లు జరగకుండా ఎన్నికలు నిర్వహించాలి'
NRPT: ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పోలింగ్ అధికారులకు సూచించారు. శనివారం ఆమె నారాయణపేట మండలం జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఇది సమస్యాత్మక కేంద్రం కావడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా అని ఎంపీడీవోను అడిగి తెలుసుకున్నారు.