పంత్ కోసం పోరాడా: MSK ప్రసాద్

పంత్ కోసం పోరాడా: MSK ప్రసాద్

రిషభ్ పంత్‌ని భారత టెస్ట్ జట్టులోకి తెచ్చేందుకు తన సొంత (సెలెక్షన్) టీమ్‌తో పోరాడానని BCCI మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ చెప్పుకొచ్చాడు. గ్లౌజ్ వేసుకోవడం రాని ఆటగాడిని వైట్ డ్రెస్‌లో ఊహించుకోలేమంటూ ఎన్నో విమర్శలు వచ్చాయని.. అందరినీ ఒప్పించి అతణ్ని జట్టులోకి తీసుకొచ్చానని తెలిపాడు. ఇప్పుడు అతనే భారత టెస్ట్ కీపర్-బ్యాటర్లలో బెస్ట్‌గా నిలిచాడన్నాడు.