శ్రీశైలంలో 32.172 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలంలో 32.172 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

NDL: శ్రీశైలం ప్రాజెక్టు కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో గడిచిన 24 గంటల కాలంలో 32.172 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఇందుకోసం జలాశయం నుంచి 70,159 క్యూసెక్కుల నీటిని శుక్రవారం వినియోగించారు. పోతిరెడ్డిపాడుకు 20,542 క్యూసెక్కులు, HNSSకు 2,638 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. నీటి ఆవిరి రూపంలో 205 క్యూసెక్కుల నీరు ఆవిరైంది.