నర్సరీ పనులను పరిశీలించిన టీఏ

నర్సరీ పనులను పరిశీలించిన టీఏ

NGKL: పెంట్లవెల్లిలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నర్సరీ పనులను టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ) ఈదన్న పరిశీలించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మామిడి తోటల పెంపకం పనులను 100% పూర్తి చేయాలని ఆయన సోమవారం సూచించారు. ఇంకుడు గుంతలు, పశువుల పాక నిర్మాణాలు, అజొల్లా, కంపోస్ట్ పిట్ వంటి నిర్మాణాలను చిన్న, సన్నకారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.