క్షతగాత్రులకు CPR చేసిన మాజీ మంత్రి
TG: తొక్కిసలాట నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న స్థానిక YCP నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు క్షతగాత్రులకు వైద్యసాయం అందిస్తున్నారు. వృత్తిపరంగా డాక్టర్ అయిన ఆయన పలువురికి CPR చేశారు. ఈ ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.