VIDEO: బొలెరో ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు..!
అన్నమయ్య: బొలెరో-బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన వనయలదిన్నెలో జరిగింది. స్థానికుల వివరాలు.. నిమ్మనపల్లి (M) జాండ్రబైలుకు చెందిన రైతు విశ్వనాథ నాయుడు (54) పుంగనూరు నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. 108 ద్వారా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.