10 నిమిషాల్లోనే కళ్లద్దాల డెలివరీ

ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ లెన్స్‌కార్ట్‌తో బ్లింకిట్ జట్టు కట్టింది. బ్లింకిట్‌లో మీ పవర్‌ను ఎంపిక చేసుకుని, కలర్ ఫ్రేమ్‌ను ఎంచుకుంటే చాలు.. ప్రిస్క్రిప్షన్ లేకుండానే 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని కంపెనీ CEO దిండ్సా పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, పూణె, చెన్నై, HYD, కోల్‌కతా, ముంబై నగరాల్లో ఈ సేవలు ప్రారంభమైనట్లు చెప్పారు.