అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి

AP: అమెరికాలో బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి(23) మృతి చెందింది. ఓ యూనివర్సిటీ రాజ్యలక్ష్మి MS కంప్యూటర్స్ కంప్లీట్ చేసి.. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. అయితే, మూడు రోజుల క్రితం జలుబు, ఆయాసంగా ఉందని.. చికిత్స కోసం ఈనెల 9కి వైద్యల అపాయింట్‌మెంట్ తీసుకుంది. అదే రోజు(గురువారం) రాత్రి పడుకుని నిద్రలోనే ప్రాణాలు విడిచింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.