పంట కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

పంట కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం నుంచి బంటుమిల్లి మండలం మల్లేశ్వరం వరకు పంట కాలువను రూ.60 లక్షల వ్యయంతో పూడికతీత పనులను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పెడన నియోజకవర్గంలో కాలువలలో ఎటువంటి పనులు జరగలేదన్నారు. రైతులకు అవసరమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.