'రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుంది'
NDL: బనగానపల్లె పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ పోలీసులకు వారు వినతి పత్రాన్ని అందజేశారు.