విద్యుత్ ప్రమాదంతో గేదె మృతి

విద్యుత్ ప్రమాదంతో గేదె మృతి

NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని స్థానిక కుడి చెరువు వద్ద బుధవారం కాలేవార్ నరేష్‌కు చెందిన గేదె విద్యుత్ ప్రమాదంతో మృతి చెందింది. వెటర్నరీ అసిస్టెంట్, విద్యుత్ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించారు. గేదె విలువ రూ. 80 వేల ఉంటుందని, ప్రభుత్వం, అధికారులు తమను ఆదుకోవాలని బాధితుడు ఈ సందర్భంగా అధికారులను వేడుకున్నారు.